అడుగడుగునా శివానందం, హిమాలయాల్లో మహదానందం మానస సరోవరం

అక్కడి నీటిబిందువు ముక్కోటి తీర్ధాలతో సమానం. అక్కడి ఇసుక రేణువు కోట్లానుకోట్ల పుణ్యతీర్ధాలతో సమానం. అక్కడ అడుగుపెట్టినంతనే జన్మజన్మల పాపాలు హరిస్తాయి. అక్కడి వాయువు సైతం భక్తుల మనసును పునీతం చేస్తుంది. ఈ విశ్వంలో అత్యంత పుణ్య స్థలం ఏది అంటే అందుకు సమాధానం ఆ ప్రదేశమే. అదే కైలాస మానస సరోవరం. ఒకటి హిమ శిఖరం మరొకటి జల తటాకం. ఈ రెండు దివ్య ప్రదేశాలను దర్శించుకోవడానికి భక్తులు వ్యయ ప్రయాసలకు ఓర్చి మనుమహిత యాత్రను చేస్తుంటారు.

ఒకటి ఆది దంపతులు ప్రమధగణాలతో అనునిత్యం నివసించే మహోత్తర పుణ్యక్షేత్రం. అక్కడికి వెళ్లాలని ప్రతి ఒక్కరికి మనస్సు పరితపిస్తూ ఉంటుంది. కానీ అచంచలమైన భక్తి విశ్వాసం ఉన్నవారు పరమాత్మ నుండి అనుగ్రహం ఉన్నవారు మాత్రమే ఆ పుణ్య క్షేత్రంలో అడుగుపెడతారు. జీవితంలో మరచిపోలేని అద్భుతమైన ఆధ్యాత్మికమైన యాత్ర అనుభవం కలగాలి అంటే అక్కడికి వెళ్లి తీరాల్సిందే. మంచు కొండలలో ప్రయాణిస్తూ అడుగులో అడుగు వేస్తూ సాగించే ఈ అద్భుతమైన యాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

కైలాస మానస సరోవరం యాత్రకు రెండు మార్గాలున్నాయి. ఒకటి: ఉత్తరాఖండ్ లోని కాట్ గోదాం నుండి ఒక మార్గం. రెండు: నేపాల్ రాజధాని ఖాట్మండ్ మీద నుండి వెళ్తుంటారు. కైలాస మానస సరోవరం యాత్ర ఇతర క్షేత్ర దర్శనాలకు భిన్నంగా ఉంటుంది. ఈ దివ్య యాత్రను చేపట్టడానికి భారత ప్రభుత్వం పరిమిత సంఖ్యలో భక్తులని అనుమతిస్తుంది. యాత్ర ప్రారంభం కావడానికి రెండు నెలల ముందుగానే పత్రికా ప్రకటనల ద్వారా భక్తులను దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరుతుంది. భక్తుల నుండి వచ్చిన వేలాది దరఖాస్తుల నుండి 12000 మందిని మాత్రమే లాటరీ పధ్ధతి ద్వారా ఎంపిక చేస్తుంది. అంటే వీరంతా మానస సరోవరం యాత్రకు అధికారికంగా వెళ్లే భక్తులు అన్నమాట.

కైలాస పర్వత పాద పీఠంలో మానస సరోవరం మరో అపురూప సృష్టి. స్వచ్ఛతకు ఈ సరస్సు నిలువుటద్దం. మానస సరోవరం నుండి కైలాస పర్వతాన్ని దర్శించుకోవచ్చు. మానస్ అంటే మనస్సు. బ్రహ్మ తన మనస్సుతో ఈ సరోవరాన్ని ఆది దంపతుల కోసం సృష్టించాడని పురాణ కథనం. ఈ సరోవరం బ్రహ్మ దేవుని మనస్సు నుంచి ఉద్భవించింది కనుక దీనిని గతంలో “బ్రహ్మసరం” అని పిలిచేవారు. ప్రతి రోజు ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో (బ్రహ్మ ముహూర్తంలో) ఈశ్వరుడు ఈ సరస్సులో స్నానం చేస్తారని భక్తుల విశ్వాసం. కైలాసం మీదుగా సరస్సులోకి ఒక జ్యోతి ప్రవేశించడం ఇక్కడికి వచ్చిన చాలా మందికి అనుభవమే. ఈ ప్రపంచం కలశం తండ్రిగా, మానస సరోవరం తల్లిగా కాపాడుతున్నాయని హిందువుల విశ్వాసం. మానస సరోవరం జలాన్ని తాకినా, స్నానమాచరించినా, సేవించినా ప్రాణకోటికి పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయని పురాణాలు ప్రతిపాదిస్తున్నాయి. పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవర తీరంలో హోమం, అభిషేకం చేయడం వల్ల పితృదేవతలకు ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి. సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలు ఉన్నాయని ప్రతీతి.

కైలాసం మామూలు పర్వతం కాదు. హిమాలయాల్లో ఏ పర్వతానికి లేని అద్భుతాలు ఇక్కడ చాలా కనిపిస్తాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో దర్శనమిస్తుంది. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తునికి ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఏదో ఒక రూపంలో ఉమాశంకరుల దర్శనం తప్పక కలుగుతుంది.

మానస సరోవరం యాత్ర హెలికాఫ్టర్ ద్వారావెళ్లదలచుకుంటే 10 రాత్రులు, 11 రోజులు. ఆసక్తి గలవారు చెక్ ఇన్ ట్రావెల్స్ ను సంప్రదించి బుక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్లు: 9618391333, 8500005757, 040-40203141.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *