విమానాశ్రయానికి వెళ్లేందుకు అందుబాటులో ‘పుష్పక్’ బస్సు

గ్రేటర్ హైదరాబాద్ నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళడానికి అనేక సాధనాలు ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నడుపుతున్న పుష్పక్ ఏర్పోర్టు బస్సులు నగరంలో నలుమూలల నుంచి విమానాశ్రయానికి వెళ్లేందుకు అనువుగా ఉన్నాయి.

ధర కూడా తక్కువే. నగరంలో ఎక్కడి నుంచయినా ఏర్ పోర్టుకు ఒక్కరికి రూ.300/-. తరచుగా ఏర్ పోర్టుకు వెళ్లే వారికోసం నెలవారీ పాస్ కూడా ఉంటుంది. నగరంలో చాలా ప్రాంతాల నుంచి రేయింబవళ్లు ప్రతి 15, 20 నిముషాలకు ఒక బస్సు బయలుదేరుతుంది.

సికింద్రాబాద్ జూబిలీ బస్ స్టేషన్ నుంచి ప్రతి 30 నిముషాలకు, శివార్లలో దూరంగా ఉన్న లింగంపల్లి నుంచి ప్రతి 50 నిముషాలకు ఒక బస్సు బయలుదేరుతుంది.

సికింద్రాబాద్, జూబిలీ బస్ స్టేషన్, మియాపూర్, లింగంపల్లి నుంచి పుష్పక్ ఏర్ పోర్టు బస్సులు నడుస్తాయి. పుష్పక్ బస్ పాస్ తీసుకున్న వారు నగరంలో ఏసీ సర్వీసులతో సహా అన్ని సిటీ బస్సులలో ప్రయాణించవచ్చు. నెలవారీ పాస్ ధర రూ.5310/-. పుష్పక్ బస్సు వేగంగా వెళ్లడంతో పాటు సౌకర్యవంతంగా ఉంటుంది.

పుష్పక్ ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ బస్సు నడిచే మార్గంలో వేచి ఉండేందుకు అనువైన బస్ షెల్టర్లు ఉన్నాయి.

అంతేకాక తెలంగాణ ఆర్టీసీ ‘గమ్యం’ యాప్ ద్వారా బస్సు రాకపోకలను, గమనాన్ని ట్రాక్ చేయవచ్చు. ఎయిర్ కండిషన్ చేసిన బస్సు లోపల విశాలంగా ఉంటుంది. సీట్లు సౌకర్యవంతంగా ఉంటాయి. ప్రతి సీటు దగ్గర సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం సాకెట్ ఉంటుంది.

సీనియర్ సిటిజన్లు ఎక్కడానికి అనువుగా మెట్టు ఉంటుంది.

సామాను పడిపోతుందనే కంగారు లేకుండా ప్రత్యేకంగా లగేజి హోల్డర్ ఉంటుంది. డిజిటల్ చెల్లింపు చేయవచ్చు. ఇప్పుడు బృందాలుగా వెళ్లే ప్రయాణికులను వారు కోరిన చోటు నుంచి పిక్ అప్ చేసుకునే సౌకర్యాన్ని కూడా తెలంగాణ ఆర్టీసీ వారు కల్పిస్తున్నారు.

సైనికపురి, ఈసీఐఎల్ చౌరస్తా వంటి చోట్ల నుంచి ఎక్కువ మంది ప్రయాణీకులు బుక్ చేసుకున్నట్లయితే వారికోసం ప్రత్యేక ట్రిప్ నడిపే యోచనలో సంస్థ ఉంది.

పుష్పక్ ఎయిర్ పోర్టు బస్సు టికెట్లను చెక్ ఇన్ ఎయిర్ ట్రావెల్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్లు: 9618391333, 8500005757, ల్యాండ్ లైన్: 040-40203141.

Share it :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *