9వ వార్షిక డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ — 23 మార్చి, 2025
మెలోడియస్ కాన్ 25 అనే శీర్షికతో నిర్వహిస్తున్న ఈ వార్షికోత్సవం ఎన్నికలకు, సంబరాలకు నెలవుగా ఉండనుంది. అందుకే ఈ వార్షికోత్సవంలో ప్రతి క్షణం, ప్రతి అంశాన్ని అందిపుచ్చుకొని ఆనందించాలని నిర్వాహకులు చెప్తున్నారు.
సమ్మేళనానికి వచ్చిన వారికి షడ్రసోపేతమైన విందు ఉంటుంది. ఇందుకోసం ఫుడ్ కూపన్లు ఇస్తారు. వివిధ ఉత్పత్తులకు సంబంధించిన స్టాల్స్ ఉంటాయి. కంపెనీలు/ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిని గురించి ఐదు నిముషాలు ప్రసంగించవచ్చు.
ఆకట్టుకునే రింగ్ టోన్ లకు అవార్డులు. ఉత్తమ గాయకులకు అవార్డులు ఉంటాయి. మహిళలకు ప్రత్యేక బహుమతులు ఉంటాయి.
మార్చి 23వ తేదీ ఆదివారం ఉదయం 7.00 గంటల నుంచి కాప్రా మద్దూరి స్వరూప గార్డెన్స్ లో జరిగే ఈ సమ్మేళనంలో డిస్ట్రిక్ట్ 320సి ఎన్నికల నిర్వహణ ముఖ్యాంశం. కన్వెన్షన్ చైర్ పర్సన్ గా పిడిజి పి సూర్యనారాయణ, పిఎంజెఎఫ్, రిజిస్ట్రేషన్ చైర్ పర్సన్ గా కె హరీష్ రెడ్డి పిఎంజెఎఫ్ వ్యవహరిస్తారు.