రైల్వే లో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు

భారతీయ రైల్వేలో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జోనల్ రైల్వేలలో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ జరుగుతుంది. ఆన్ లైన్ లో దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 10వ తేదీన మొదలై మే నెల తొమ్మిదవ తేదీన ముగుస్తుంది. దరఖాస్తుదారులు దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ / ఓబీసీ అభ్యర్థులు రూ. 500 ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మాజీ సైనికులైన అభ్యర్థులకు రూ. 250.

పోస్టు పేరు: అసిస్టెంట్ లోకో పైలట్ (ఏ ఎల్ పి)
7వ పే కమిషన్ ప్రకారం వేతనం స్థాయి : 2
ప్రారంభ వేతనం : రూ. 19,900/-

01-07-2025 నాటికి వయస్సు : 18-30 సంవత్సరాలు, రిజర్వుడ్ అభ్యర్థులకు ఓబీసీ లకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

అభ్యర్థులు ఆల్ లైన్ లో దరఖాస్తు నింపడానికి ముందు 01/2025 (ఏ ఎల్ పి) నోటిఫికేషన్ ను చూసి దరఖాస్తును పూర్తిచేయాలి. దరఖాస్తుల ప్రారంభ తేదీకి ఒక రోజు ముందు నుంచి భారతీయ రైల్వే అధికారిక వెబ్ సైట్లలో నోటిఫికేషన్ పూర్తి పాఠం అందుబాటులో ఉంటుంది. అభ్యర్థుల పేరు, పుట్టిన తేదీ ఆధార్ కార్డుతో సరిపోలాలి. అభ్యర్థులు తమ ఆధార్ ఫోటో, వేలి ముద్రలు అప్ డేట్ చేసుకోవాలి.

ఇక ఉద్యోగాల ఖాళీల విషయానికి వస్తే ఈస్ట్ కోస్ట్ రైల్వే లో 1461, దక్షిణ మధ్య రైల్వేలో 989, ఆగ్నేయ రైల్వేలో 921 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్థులు 10వ తరగతి సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ / డిప్లొమా / డిగ్రీలో పాసై ఉండాలి.

అభ్యర్థులు కంప్యూటర్ ఆధార పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. సిబిటి 1, సిబిటి 2 తరువాత సిబిటి 2 లో అర్హత సాధించిన వారికి కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. తుది ఎంపిక కోసం సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షలు ఉంటాయి.

ఈ పోస్టులకు అర్హతలు ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ rrbapply.gov.in ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

Share it :