ఒక్కొక్కసారి మనస్సుకి అనిపిస్తుంది కాలం వెనక్కి అడుగులు వేసి ఆ జ్ఞాపకాల చెంత మనల్ని నిలిపితే ఎంత మధురంగా ఉంటుంది అని. ఒక్క క్షణం పాత సంగతుల్ని తలచుకున్నప్పుడు, శుభకార్యానికి పంచిన పంచధార చిలకలా, వనాల చెంత గుబాళించే సంపెంగ స్పర్శలా అనుభూతి అందిస్తాయి.
కాలం దయలేనిది. అది వేగంగా పరుగులు తీస్తుంది టప వెనక్కి తిరిగిరాదు. గడియారం ముల్లు కదలుతున్నప్పుడు అన్నీ కరిగిపోతాయి. ప్రేక్షకుల మనస్సులకు సాన్నిహిత్యంగా నిలచిన సంతోషం చిత్రం దాదాపు సిరవై మూడేళ్ళ తరువాత కూడా భావోద్వేగాల పరంగా హృదయ ఆకాశంపై నిజంగానే సంతోషాల వెన్నెలని కురిపించింది.
సిరివెన్నెల సాహితీ అక్షయ పాత్ర నుంచి సంతోషం చిత్రానికి ఆయన రాసిన మేలి ముత్యాలను ఏరుకుని ప్రస్తావించడం ఆనందంగా ఉంది. నాగార్జున ఒక సమావేశంలో మాట్లాడుతూ సిరివెన్నెల మనస్సును ఒక పసిబాలుడిగా పోల్చారు.
ఒక్కసారి పాటల తెర తీసినప్పుడు ఆ అక్షరాలు చిలికించిన పన్నీటి గంధాలు ఇక అలాగే సుగంధాల ముద్రను శాశ్వతంగా మనకు మిగిల్చాయి. సిరివెన్నెల సాహిత్యం ఆర్. పి. పట్నాయక్ సంగీతంలో మేళవించి సంతోషాల వెలుగుల్ని నిరంతరం మనపై సజీవంగా ప్రవహిస్తూ పల్లవిస్తూనే ఉండటం విశేషం. ఎన్ని వసంతాలు గడచినా ఆ పాటల తియ్యని గుర్తులు నా తలపుల్లో కదలాడుతూనే ఉంటాయి.
సిరివెన్నెల భావ సంతకం చేసిన ఈ అపురూప గీతం నిజంగానే అందరి ఇష్టాల్ని కానుకగా పొందడం విశేషం.
“నువ్వంటే నా కిష్టం అన్నది నా ప్రతీశ్వాస నువ్వేలే నా లోకం అన్నది ప్రతీ ఆశ” అనే పాట ఇద్దరి మధ్య
ఉన్న అనుబంధాల బంధాలను ఆవిష్కరిస్తుంది. ఆశే మనుషుల్ని బ్రతికిస్తుంది అన్నది సిరివెన్నెల
భావన.
సిరివెన్నెల పాటల పొదిలో ఎన్నో అక్షర మాధుర్య తూణీరాలు. ఇవి సున్నితంగా మనస్సును తాకి
చిత్ర విచిత్రమైన అనుభూత