భారత సైన్యంలో అగ్ని వీర్ రిక్రూట్మెంట్ 2025 కోసం నోటిఫికేషన్ విడుదలైంది.ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించడం మార్చి 12న మొదలైంది. ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చు.దరఖాస్తు ఫీజు చెల్లించవలసిన చివరి తేదీ కూడా 2025 ఏప్రిల్ 10.
అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు భారత సైన్యం అధికారిక వెబ్ సైట్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.దరఖాస్తు పీజు . రూ. 250 ఆన్ లైన్ లో చెల్లించవచ్చు. అభ్యర్థుల వయస్సు 2025 ఏప్రిల్ 10వ తేదీ నాటికి కనీసం 17 సంవత్సరాలు పూర్తయి ఉండాలి.అదే తేదీకి గరిష్టంగా 25 సంవత్సరాలు నిండి ఉండరాదు.ఎంపిక చేసుకునే ఉద్యోగం ఆధారంగా గరిష్ట వయస్సు మారుతుంది